
కొన్ని వారాల్లో అల్లం వాడేయాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టడం సులభమైన పద్ధతి . అల్లానికి తొక్క తీయకుండా పేపర్ టవల్లో చుట్టాలి. తర్వాత దాన్ని జిప్‌లాక్ బ్యాగ్ లేదా గాలి ఎక్కువగా లోపలికి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లోని క్రిస్పర్ డ్రాయర్లో ఉంచాలి. పేపర్ టవల్ అదనపు తేమను పీల్చుకుంటుంది. ఇలా చేస్తే అల్లానికి బూజు పట్టే అవకాశం తగ్గుతుంది. ఇలా నిల్వ చేస్తే అల్లం సాధారణంగా 3-4 వారాల వరకు తాజాగా ఉండొచ్చు. అల్లాన్ని వెంటనే వాడే పరిస్థితి లేకపోతే ఫ్రీజర్‌లో పెట్టడం మంచి మార్గం. తొక్క తీయకుండా అల్లాన్ని ఫ్రీజర్ బ్యాగ్‌లో వేసి, అందులోని గాలిని వీలైనంత వరకు బయటకు తీసి మూసేయాలి. వాడేటప్పుడు పూర్తిగా కరిగించాల్సిన అవసరం లేదు. అవసరమైనంత అల్లాన్ని నేరుగా తురిమి వంటలో వేసుకోవచ్చు. ఇలా నిల్వ చేస్తే అల్లం 3-6 నెలల వరకు ఉండొచ్చు. రోజూ అల్లం ఉపయోగించే వారికి ఈ పద్ధతి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ అల్లాన్ని తురిమి, ఐస్ క్యూబ్ ట్రేలో చిన్న చిన్న భాగాలుగా పెట్టి ఫ్రీజ్ చేయాలి. అవి గట్టిపడిన తర్వాత ఆ ముక్కలను ఒక ఫ్రీజర్ బ్యాగ్‌లోకి మార్చుకోవచ్చు. టీ లేదా కూర చేసేటప్పుడు అవసరమైనంత ఒక ముక్క తీసుకుని నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే ప్రతిసారీ అల్లం తురిమే పని కూడా తగ్గుతుంది. తొక్క తీసిన అల్లాన్ని నీటిలో ముంచి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందని కొందరు అనుకుంటారు. కానీ ఈ పద్ధతితో అల్లం త్వరగా మెత్తగా, జిగురుగా మారే అవకాశం ఉంది. నీటిలో ఉంచడం వల్ల పాడయ్యే ప్రక్రియను ఆపలేం. కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే ఫ్రీజర్ పద్ధతిని ఎంచుకోవడం మంచిది. ఫ్రిజ్ లేకుండా అల్లాన్ని కొంతకాలం నిల్వ చేసుకోవాలంటే శుభ్రమైన, పొడి ఇసుక, పొడి మట్టిలో కొంతమంది స్టోర్ చేస్తారు. ముందుగా అల్లాన్ని కడగకుండా, బయట తేమ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఒక శుభ్రమైన డబ్బాలో పొడి ఇసుక లేదా మట్టిని వేసి, అందులో అల్లం ముక్కలను పెట్టి పూర్తిగా కప్పాలి. డబ్బాను తేమ, ఎండ నేరుగా తగలని చల్లటి ప్రదేశంలో ఉంచాలి. ఇలా ఉంచినప్పుడు అల్లం త్వరగా ఎండిపోకుండా ఉండొచ్చు. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.





