
దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా అవార్డ్స్ - 2026 వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో తొలి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు అవార్డులు ఇవ్వగా.. రెండో రోజు తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ సినీ తారలు సందడి చేశారు. అవార్డు గ్రహీతలతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ SIIMA సోషల్ మీడియాలో పంచుకుంది. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.





