
ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ దాడులు, అక్రమ నిఘా, జీవాయుధ పరిశోధనల వంటి హానికరమైన కార్యకలాపాలకు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తున్నారన్న వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence)తో ప్రమాదం పొంచి ఉందని ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్ (Dario Amodei), ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman), ఎక్స్‌ఏఐ అధిపతి ఎలాన్‌మస్క్‌ ( Elon Musk ) అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కూడా ఇదే వాదనను సమర్థించింది. సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘మనం అభివృద్ధి చేస్తోన్న కృత్రిమ మేధ మానవాళికి ఉపయోగపడకపోతే, మనుషుల నియంత్రణలో లేకపోతే దానిపై ఇంకా దృష్టిపెట్టడంలో ఎలాంటి అర్థం లేదు’’ అని నాదెళ్ల (Satya Nadella) రాసుకొచ్చారు. ఈ సాంకేతిక వేగానికి ఇకనైనా కళ్లెం వేయాలని , కంపెనీలు తమ మోడళ్ల భద్రతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలంటూ టెక్ దిగ్గజాలు చేస్తోన్న సూచనలను సమర్థించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





