
పర్యాటకుల భద్రతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం బాపట్ల, న్యూస్‌టుడే జిల్లాలోని తీర ప్రాంతం పర్యాటకంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వారాంతపు సెలవులకు తోడు వినాయక చవితి పండగ రావడంతో హైదరాబాద్, ఇతర దూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకుల రాకతో బీచ్‌లలో సందడి నెలకొంది. ఇలాంటప్పుడు పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీసులు డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. బీచ్‌ల వద్ద డ్రోన్లు ఎగురవేసి నిఘా పెడుతున్నారు. సముద్రంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ ఎవరైనా నీటిలో మునిగితే సత్వరమే గుర్తించి గజ ఈతగాళ్లు కాపాడుతున్నారు. ప్రముఖ బీచ్‌లు: సూర్యలంక, రామాపురం, వాడరేవు, పాండురంగాపురం, రామచంద్రాపురం, అడవిపల్లెపాలెం, కృపానగర్, పొట్టిసుబ్బయ్యపాలెం, కఠారిపాలెం .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





