
అధ్వాన రోడ్లతో ప్రజలకు తప్పని తిప్పలు కంకరకే పరిమితమైన ఆకుమర్రితండా బీటీ రోడ్డు పనులు ధన్వాడ, న్యూస్‌టుడే: ధన్వాడ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధులు మూలుగుతున్నాయి. టెండర్లు వేసేందుకు తొమ్మిదిసార్లు ఆహ్వానించినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. నిధులు అందుబాటులో ఉన్నా రోడ్ల సమస్యలు తీరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు ఎక్కడెక్కడంటే..: ధన్వాడ మండలం చర్లపల్లి- మీదికుంటతండా వరకు ఉన్న 2.20 కి.మీల రోడ్డును బీటీగా మార్చేందుకు రూ.1.80 కోట్లు, చర్లపలి- శీకర్లగడ్డతండా వరకు రూ.1.80 కోట్లు, మంజూరయ్యాయి. ప్రధానంగా బీటీ రోడ్ల పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





