
రహదారి నిర్మాణానికి శంకుస్థాపనలో మంత్రి సుభాష్‌ కాజులూరు, న్యూస్‌టుడే: రహదారుల నిర్మాణంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. మండలంలో రూ.15.97 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా పనులు చేపట్టామని వివరించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.270 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. కాజులూరు మండలంలో తొమ్మిది రహదారుల నిర్మాణం త్వరితగతిన నాణ్యతతో పూర్తిచేయాలని గుత్తేదారులకు సూచించారు. అనంతరం గొల్లపాలెంలో డేగల వెంకటసతీష్‌ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను స్థానికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ ఛైర్మన్‌ అక్కల రిష్వంత్‌రాయ్, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఏసీఆర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





