
పట్టించుకుంటే రూ. 10 లక్షల నుంచి రూ.కోటికి పెరగనున్న ఆస్తిపన్ను న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం ఇక్కడ నిర్మాణమవుతున్న పెద్ద భవనం పరిశ్రమ కోసమని చెబుతున్నారు. ఇది ఆదిలాబాద్‌ పురపాలక సంఘం పరిధిలో ఉన్నప్పటికీ తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ఇచ్చిన స్థలం కావడంతో నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను వసూళ్లన్నీ ఆ సంస్థనే నిర్వహిస్తోంది. నిర్మాణాలకు, ఆస్తిపన్నుకు గతంలో ఉన్న పంచాయతీ ధరలే వర్తింపజేస్తుండటంతో ఆర్థికంగా నష్టం ఏర్పడుతోంది పా రిశ్రామిక రంగానికి ఊతమిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు దస్నాపూర్‌ ఏరియా పరిధిలోని 37 ఎకరాల్లో 53 ప్లాట్లు కేటాయించారు. ఒక్కొక్కరికి ఎకరం, అర ఎకరం వరకు 1984లో కారుచౌకగా అప్పగించారు. వాస్తవానికి ఇక్కడ పరిశ్రమలు నడపాల్సి ఉండగా ప్రస్తుతం అత్యధికంగా ఇతర వ్యాపారులు ఉండటం విమర్శలకు దారితీస్తోంది. స్థలాలకు డిమాండ్‌ పెరగడంతో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. . గతంలో ఈ స్థలాలు మావల పంచాయతీ పరిధిలో ఉండటంతో అక్కడ నిర్మించిన గోదాంలు, ఆయిల్‌మిల్‌లు, ఇతర భవనాలన్నింటికీ పంచాయతీ ధరలకు అనుగుణంగా టీజీఐఐసీ అధికారులే ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. పట్టణంలో ఉంటే మున్సిపల్‌ ధరలకు అనుగుణంగా ఆస్తి పన్ను వర్తింపజేయాలనేది నిబంధన. 2018 ఆగస్టులో చుట్టుపక్కల కాలనీలతో పాటే ఈ స్థలాలూ ఆదిలాబాద్‌ మున్సిపాల్టీలో విలీనమయ్యాయి. ఇప్పటికీ విశాలమైన స్థలాల్లో హోల్‌సేల్‌ దుకాణాలు, షోరూంలు కొనసాగుతున్నా ఒక్కో భారీ భవనానికి రూ.5వేల నుంచి మొదలు రూ.20వేల వరకు మాత్రమే ఏడాదికి ఆస్తి పన్ను వసూలవుతోంది. ఈ విషయమై టీజీఐఐసీ నిజామాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. తాను వచ్చాక ఆస్తిపన్ను పెంచాలని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





