‘కపుల్ ఫ్రెండ్లీ’ విజయంతో మంచి ఊపుమీదున్న యువ హీరో సంతోష్ శోభన్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘సత్తిబాబు పరలోకయాత్ర’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది తెలుగులో ఫస్ట్ మల్టీవర్స్ కామెడీ మూవీ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, మానస చౌదరీలు కథానాయికలుగా నటిస్తున్నారు.
N





