
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ రెండో వారంలో అడుగుపెట్టడంతోనే ఇంట్లో వేడి వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 16న ప్రసారమైన ఎపిసోడ్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కాస్త తీవ్రమైన ఫిజికల్ ఫైట్‌గా మారింది. పోటీదారులు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించడంతో హౌస్‌లో గొడవలు చోటుచేసుకున్నాయి. ముందుగా జరిగిన ‘అనిమల్ పార్క్’ టాస్క్‌లో ఝాన్సీ సరైన సైగలు చేయగా, ముఖేష్ వాటిని గుర్తించి విజయం సాధించాడు. కానీ అమన్, షాలినీ జోడీ తడబడటంతో అమన్‌ను రేసు నుంచి తప్పించారు. ఈ క్రమంలో షాలినీ, అమన్ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కిచెన్ ఏరియాలో ఫుడ్ విషయంలో ముఖేష్, వర్షిణిలకు, వంశీ, త్రిగుణ్‌లకు మధ్య పెద్ద గొడవే జరిగింది. ముఖ్యంగా ముఖేష్ కాస్త ఎక్కువ రైస్ తిన్నాడనే కారణంతో వంశీ, త్రిగుణ్ రెచ్చిపోయి నోటికి పని చెప్పారు. ఇష్టమొచ్చినట్లుగా ముఖేష్ పై మాటల దాడి చేశాడు. అలాగే నూనె కిందపడి వెస్ట్ అయ్యిందంటూ వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకపై వంటగది నిబంధనలు కఠినంగా ఉంటాయని హెచ్చరించాడు.




