
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
© 2026 nimisham.in

ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
పనులపై పూర్తి దృష్టి పెట్టి ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబసభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా వ్యవహరించడం ద్వారా ముఖ్యమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. కుటుంబసభ్యుల సహకారం మీకు బలాన్నిస్తుంది. అవసరమైన సమయంలో ఆర్థికంగా ఊరట లభించే సూచనలున్నాయి. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు సక్రమంగా పూర్తవుతాయి. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన శుభఫలితాలనిస్తుంది. సంతోషకరమైన సమాచారం ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయగలుగుతారు. నవగ్రహ ఆరాధన శ్రేయస్కరం. ఆలోచించి అడుగులు వేస్తే ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమిస్తారు. కీలక నిర్ణయాల్లో సమయస్ఫూర్తి ఉపయోగపడుతుంది. ఉన్నతాధికారులు, పెద్దల సహకారం లభిస్తుంది. శివారాధన శుభప్రదం. సమయోచితంగా తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను అందిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులతో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. పరమేశ్వరుని దర్శనం శుభప్రదం. పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధించి ఉత్సాహంగా ఉంటారు. శుభవార్త వింటారు. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తే ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. చేపట్టిన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లాభాన్ని అందించే సూచనలున్నాయి. సమయపాలనతో పనిచేస్తే ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం మంగళప్రదం. కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. బంధువులు, మిత్రుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. శివనామ స్మరణ శుభప్రదం. లక్ష్యంపై దృష్టి నిలిపి కృషి చేస్తే ఆశించిన ఫలితం దక్కుతుంది. ఆదాయ వృద్ధికి అనుకూలమైన అవకాశాలు ఎదురవుతాయి. భూమి, గృహం.. స్థిరాస్తి సంబంధిత విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. పనులను క్రమపద్ధతిలో నిర్వహించడం అవసరం. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండి పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పోటీ పరిస్థితుల్లో మీకు అనుకూలత ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి నామస్మరణ శుభప్రదం. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఈశ్వర ధ్యానం శ్రేయస్కరం. పరిస్థితులు కొంత అనుకూలంగా, కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి స్థిరచిత్తంతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ అవసరం. ప్రయాణాలు చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







