
ఇంటర్నెట్‌ డెస్క్: సీఆర్పీఎఫ్‌ కోబ్రా (CoBRA) యూనిట్‌ ఐజీగా ఐపీఎస్‌ అధికారిణి సంజుక్తా పరాశర్‌ (Sanjukta Parashar) నియమితులయ్యారు. ఈ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన సంజుక్త.. 2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దనేష్ రాణా స్థానంలో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. అస్సాంకు చెందిన సంజుక్త గతంలో స్వరాష్ట్రంలోనే విధులు నిర్వహించడంతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లోనూ సేవలందించారు. అస్సాంలోని దట్టమైన అడవుల్లో క్లిష్టమైన సవాళ్ల నడుమ అనేక కీలక ఆపరేషన్లు నిర్వహించిన ఆమెకు.. ‘ఐరన్‌ లేడీ ఆఫ్‌ అస్సాం’ (Iron Lady of Assam)గా పేరుంది. దిల్లీలోని జేఎన్‌యూలో ఉన్నత విద్యనభ్యసించిన ఆమె.. యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలో ఆల్‌ ఇండియా 85వ ర్యాంకు సాధించారు. అంతరిక్షంలో ఫుట్‌బాల్‌ ఆడిన వ్యోమగాములు మావోయిస్టులను, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు 2008లో కోబ్రా యూనిట్‌ ఏర్పాటైంది. జంగిల్‌ వార్‌ఫేర్‌, గెరిల్లా ఆపరేషన్లను నిర్వహించడంలో ఈ యూనిట్‌ దిట్ట. మణిపుర్‌లో సాయుధ హింసను అరికట్టేందుకు సీఆర్పీఎఫ్‌ ఇటీవల రెండు కోబ్రా యూనిట్లను మోహరించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





