
బిహార్‌లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు తాము వ్యతిరేకమని జేడీయూ స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లుకు తాము మద్దతు తెలిపినప్పటికీ.. రాష్ట్రంలో అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్‌ నేత శ్యామ్‌ రజక్‌ వెల్లడించారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత నీతీశ్‌ కుమార్‌ ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు. 2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమల్లోకి వస్తుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై శ్యామ్‌ రజక్‌ ఈమేరకు స్పందించారు.





