
Home » National » Russian President Putin Departs New Delhi After 18th BRICS Summit avn
భారత్ అధ్యక్షతన రెండు రోజుల పాటు ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసిన నేపథ్యంలో ఆయా దేశాధినేతలు తమ స్వదేశాలకు తిరుగుప్రయాణమవుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యాకు బయలుదేరారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 13 : భారత్ అధ్యక్షతన రెండు రోజుల పాటు ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసిన నేపథ్యంలో ఆయా దేశాధినేతలు తమ స్వదేశాలకు తిరుగుప్రయాణమవుతున్నారు. సదస్సు ముగిసిన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ (ఆదివారం) ఢిల్లీ నుంచి రష్యాకు బయలుదేరారు. సదస్సులో భాగంగా పుతిన్ వివిధ గ్లోబల్ సెషన్లలో పాల్గొనడంతో పాటు భారత్ మంటపంలో ఏర్పాటు చేసిన 'భారత్ ఇన్నోవేట్స్' ప్రదర్శనను సందర్శించారు.
పుతిన్ పర్యటన.. ప్రసంగంలోని ముఖ్యాంశాలు
పాశ్చాత్య దేశాల ఆంక్షలపై ఆగ్రహం
బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ నేతల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలపై విరుచుకుపడ్డారు. రష్యాపై ఇప్పటివరకు 30,000 కంటే ఎక్కువ ఆంక్షలు విధించారని, ఇది ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలపై ఉన్న మొత్తం ఆంక్షల కంటే రెండింతలు ఎక్కువని ఆయన వెల్లడించారు. దౌత్య, వాణిజ్య ఒత్తిళ్లను అసంబద్ధ పోటీ తత్వానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.
మోదీ - పుతిన్ ద్వైపాక్షిక భేటీ
సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బిష్కెక్ (విష్కెక్) లో జరిగిన SCO సదస్సు తర్వాత రెండు వారాల్లోనే వీరిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి.
ఈ భేటీలో 'ప్రోగ్రామ్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ 2030' అమలుతో పాటు రక్షణ, ఇంధనం, మౌలిక వసతులు, సాంకేతికత, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారంపై చర్చించారు.
పశ్చిమాసియా, నల్లసముద్రం సంక్షోభం
పశ్చిమాసియా, నల్లసముద్రం (Black Sea) ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, నౌకాయాన వాణిజ్యం, భారతీయ నావికుల భద్రతపై ప్రభావం చూపుతున్న అంశాలపై ఇరునేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఎలాంటి వివాదానికైనా దౌత్యం, నిరంతర చర్చలే పరిష్కార మార్గమని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
రష్యా అధ్యక్షుడితో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ కూడా సదస్సు ముగించుకుని ఢిల్లీ నుంచి స్వదేశాలకు తిరుగు పయనమయ్యారు.
అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ



