
Road Accident : హైదరాబాద్ కోకాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్త్‌డే పార్టీ అనంతరం ఔటర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన 9 మంది మైనర్లలో ఒకరు దుర్మరణం చెందాడు. నియో పోలీస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మదన్ మోహన్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడి పుట్టిన రోజున పార్టీకి వెళ్లిన విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన 9 మంది మైనర్లలో ఒకరు దుర్మరణం చెందాడు. నియో పోలీస్ వద్ద ఇన్నోవా క్రిస్టా పల్టీలు కొట్టడంతో ఇంటర్ విద్యార్థి అయిన మదన్ మోహన్ రెడ్డి మరణించాడు. మిగతా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా హైటెక్ సిటీలో తేజు కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్టు సమాచారం. తమన్ వర్మ అనే విద్యార్థి బర్త్‌డే పార్టీకి వెళ్లి లాంగ్ డ్రైవ్ కోసం ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కోకాపేట్లో ఘోర రోడ్డు ప్రమాదం బర్త్‌డే పార్టీ అనంతరం ఔటర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన 9 మంది మైనర్లు నియో పోలీస్ వద్ద పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా వాహనం, మదన్ మోహన్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి మృతి తీవ్ర గాయాలపాలైన మరో ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులు,… pic.twitter.com/uKrbaFqT94 — Telugu Scribe (@TeluguScribe) September 13, 2026




