
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.





