
Vijay Deverakonda & Rashmika's Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీలో రష్మిక పోషిస్తున్న జయమ్మ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో రష్మిక బేబీ బంప్‌తో కనిపిస్తున్నారు.






