
తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల ఆకలి హార్మోన్లు స్థిరంగా ఉండవు. దీని వల్ల ఎక్కువగా ఆకలి వేస్తుందని క్వీవ్లాండ్ క్లీనిక్ తెలిపింది. ఫైబర్ ఫుడ్ తింటే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఫైబర్ లోపం వల్ల కడుపు ఖాళీగా అనిపిస్తుంది. ఆకలి వేస్తుంది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి తగ్గుతాయి. దీని వల్ల ఆకలి వేస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోకపోవడం వల్ల కూడా కడుపు నిండిన భావన రాదు. దీంతో ఆకలి వేస్తుంది. ఒత్తిడి పలు సమస్యలకు కారణం అవుతుంది. ఒత్తిడి పెరగడం వల్ల ఆకలి హార్మోన్లు స్థిరంగా ఉండవు. ఆకలి ఎక్కువగా వేస్తుంది. డీహైడ్రేషన్‌ను మెదడు ఆకలిగా పొరబడుతుంది. దీని వల్ల అన్నం తినాలనే కోరిక కలుగుతుంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగండి. ఆహారం వేగంగా తినడం వల్ల కడుపు నిండిన సంకేతాలను మెదడు గ్రహించదు. దీని వల్ల తిన్న కాసేపటికే ఆకలి వేస్తుంది. స్టెరాయిడ్స్, యాంటీ డిప్రెసెంట్లు, యాంటీహిస్టమైన్ వంటి మందులు వేసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. షుగర్, హైపో థైరాయిడిజం, హైపోగ్లైసీమియా వంటి సమస్యల వల్ల కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది.




