
ఆదిలాబాద్ జిల్లా చందా గ్రామంలో 800 ఏళ్ల నాటి బాల గణేశుడి అరుదైన శిల్పాన్ని ఉపాధ్యాయుడు పృథ్వీరాజ్ గుర్తించారు. 12వ శతాబ్దపు ఈ శిల్పంలో పార్వతీ దేవి ఒడిలో బాల గణేశుడు చనుబాలు తాగుతున్న దృశ్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి శిల్పం లభించడం ఇదే తొలిసారి అని చరిత్రకారులు ధ్రువీకరించారు.




