

RC17 : రంగస్థలంతో బిగ్ కొట్టిన రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ మరో ప్రాజెక్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. RC17 టైటిల్‌తో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న RC17 సినిమాపై ఫ్యాన్స్‌లో అప్పుడే ఫుల్ ఎగ్జైట్మెంట్ నెలకొంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాకు సంబంధించి ఓ లీకు ఆసక్తికరంగా మారింది. దసరా పండుగ సందర్భంగా RC17ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు టాక్. షూటింగ్ దసరా తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
ఈ సారి సుకుమార్, రామ్ చరణ్‌ను రంగస్థలంలో చూపించిన చిట్టిబాబు తరహాలో కాకుండా పూర్తిగా కొత్త లుక్, కొత్త షేడ్స్‌తో ప్రజెంట్ చేయబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. కథ, పాత్ర, బ్యాక్‌డ్రాప్ విషయంలో సుకుమార్ భారీగా హోంవర్క్ చేస్తున్నారట. అందుకే RC17 ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్ స్కేల్లో నిర్వహించే ప్లాన్ చేస్తున్నారట.
Ariyana Glory : వినాయక చవితి.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అరియానా గ్లోరీ
అయితే దసరా ముహూర్తంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. RC17ని పూర్తిగా నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేస్తున్నారట. కథ, క్యారెక్టర్, మేకింగ్, ఆల్ లెవెల్స్‌లో రిస్క్ తీసుకొని మరీ గ్రాండ్ సక్సెస్ కొట్టాలని భావిస్తున్నారట. Rc 17 సినిమా కథ పూర్తిగా అడవి జీవితం చుట్టూ తిరగడమే కాదు.. రియలిస్టిక్, రా టోన్‌లో ఉండబోతుందని అంటున్నారు. ఈ మూవీలో చరణ్ పాత్ర కూడా పూర్తిగా డిఫరెంట్‌గా..అడవిలో పుట్టి, అడవిలోనే పెరిగి, ప్రకృతితో కలిసి బ్రతికే ఓ అడవి మనిషి లాంటి క్యారెక్టర్లో కనిపిస్తాడని టాక్.





