
Rahul Gandhi : బ్రిక్స్ సదస్సులో దేశాధినేతలకు ఏర్పాటు చేసిన విందులో మాంసాహారం(Non Veg) లేకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు. నోరూరించే పలు రకాల రుచులతో భారతీయ వైవిధ్యాన్ని చాటామని గొప్పలు చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి ‘దేశంలో 80 శాతం మాంసాహారులే అన్న సంగతి గుర్తులేదా?’ అని రాహుల్ ధ్వజమెత్తారు. ఆదివారం ఎక్స్ వేదికగా బ్రిక్స్ ఆహ్వానితుల మెనూలో పూర్తిగా వెజ్‌కే ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుట్టారు విపక్ష నేత. న్యూ ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశానికి విచ్చేసిన సభ్య దేశాల నాయకులు, ప్రతినిధుల డిన్నర్ మెనూపై లోక్‌సభ విపక్షనేత రాహుల్ గాంధీ ఫైరయ్యారు. మెనూలో అన్నీ శాకాహార వంటకాలే ఉండడంపై ఆగ్రహించిన ఆయన.. దేశంలో ఎనభైశాతం మంది మాంసాహారులే అనే విషయం ప్రధాని మోడీకి తెలియదా? అని ప్రశ్నించారు. For the record: 80% of Indians are non-vegetarian. Indian non-vegetarian food is delicious. As are my sister’s chole bhature. pic.twitter.com/8f6ziKjLan — Rahul Gandhi (@RahulGandhi) September 13, 2026 ‘మీకు ఓ విషయం స్పష్టం చేస్తున్నా. భారత్‌లో 80 శాతం మంది మాంసాహారులే. పైగా మాంసాహారం చాలా రుచిగా ఉంటుంది. నాన్‌వెజ్ కాదని ఛోలే భతూరే రుచిస్తుందా ఎవరికైనా’ అని రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ మీడియా ప్రతినిధి పవన్ ఖేరా తమ నేతకు మద్దతుగా నిలిచారు. ‘వైవిధ్యమైన వంటకాల్లో ప్రపంచంలోనే రుచికరమైన నాన్ వెజ్ డిజ్లను విదేశీ అతిథులకు వడ్డించాల్సింది. కానీ, ప్రభుత్వం ఎందుకు వీటిని ఎంచుకోలేదు. ఇప్పటికే బీజేపీ రుద్దాలనుకుంటున్న ఆహారాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా తమకు నచ్చిన వంటకాలను ప్రపంచ నేతలకు వడ్డించారు’ అని పవన్ ఖేరా దుయ్యబట్టారు. డిన్నర్ మెనూపై రాహుల్ పెట్టిన పోస్ట్‌పై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి వంటలను కూడా రాజకీయం చేస్తోంది అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ‘బ్రిక్స్ దేశాధినేతలకు వడ్డించిన ఆహారంపై కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందంటే నాకు నమ్మశక్యంగా లేదు’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. Here’s the BRICS dinner menu with a photo next to each item. pic.twitter.com/iRLJbcCCMV — Grok (@grok) September 12, 2026






