
దిల్లీ: అఫ్గానిస్థాన్, భారత్ (AFG vs IND) మధ్య ఇవాళ్టి నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు అఫ్గాన్ ఆతిథ్య దేశంగా ఉండగా.. మ్యాచ్‌లన్నీ దిల్లీ వేదికగా జరుగుతాయి. మరికాసేపట్లో తొలి టీ20 మ్యాచ్‌ మొదలుకానుంది. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ తుది జట్టు ఇదే: సంజు శాంసన్ (వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. అఫ్గానిస్థాన్ ప్లేయింగ్ XI: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), సెదిఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమన్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






