
అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు భారత్‌ సిద్ధమైంది. దిల్లీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌.. బౌలింగ్‌ ఎంచుకుంది. అఫ్గాన్‌తో భారత్‌ ఇప్పటివరకు తొమ్మిది టీ20లు ఆడగా.. ఏడింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ టై కాగా.. ఒకదాంట్లో ఫలితం రాలేదు. భారత జట్టు: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్యర్‌, తిలక్ వర్మ, నితీశ్‌కుమార్, శివమ్ దూబే, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
