
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పదమూడేళ్ల క్రితం మావోయిస్టులు జరిపిన దాడిలో కాంగ్రెస్‌ నేతలు సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ పూర్తి చేసిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు.. పది మందిని దోషులుగా తేలుస్తూ వారికి మరణ శిక్ష విధించింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. బస్తర్‌ జిల్లాలోని ఝీరాం వ్యాలీలో 2013లో కాంగ్రెస్‌ పరివర్తన్‌ ర్యాలీ నిర్వహించింది. ఆ సభను లక్ష్యంగా చేసుకొన్న మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఆ ఘటనలో కేంద్ర మాజీ మంత్రి విద్యా చరణ్‌ శుక్లాతో సహా 29 మంది మృతి చెందారు.





