
సౌత్‌ జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ హైదరాబాద్, ఈనాడు: సౌత్‌ జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లు అదరగొట్టారు. పుదుచ్చేరిలో బుధవారం మొదలైన టోర్నీలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ‘లక్ష్య’ క్రీడాకారులు పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన శ్రీదివ్య డోరా అండర్‌-16 బాలికల 80 మీటర్ల హర్డిల్స్‌లో 12.21 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు దుద్దు శేషు 100 మీటర్ల పరుగును 10.92 సెకన్లలో పూర్తి చేసి పసిడి సొంతం చేసుకున్నాడు. మౌనిక మిశ్రా (ఆంధ్రప్రదేశ్‌) లాంగ్‌జంప్‌లో 5.41 మీటర్లు దూకి రజతం సాధించింది. బాలికల 400 మీటర్ల పరుగులో ప్రశంస (తెలంగాణ) 58.17 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం నెగ్గింది. రఘుపతి నాయుడు (తెలంగాణ) ట్రయథ్లాన్‌లో కంచు పతకం గెలిచాడు. రిషిత (ఆంధ్రప్రదేశ్‌) జావెలిన్‌ త్రోలో 31.16 మీటర్ల్లతో కాంస్యం గెలుచుకుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





