
నాలుగేళ్ల వయసు నుంచే డయాబెటిస్‌ వెంటాడింది. క్రీడల జోలికి వెళ్లొద్దని వైద్యులు సూచించారు. కానీ, అవేవీ అతడిని ఆపలేకపోయాయి. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో టెన్నిస్‌లో కష్టపడ్డాడు. ఎట్టకేలకు తొలిసారి యూఎస్‌ ఓపెన్‌- 2026 విజేతగా నిలిచాడు. ఇదీ జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ స్ఫూర్తిదాయక ప్రయాణం. తనలా ఇబ్బంది పడే చిన్నారుల కోసం అతడు ‘అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫౌండేషన్‌’ను స్థాపించాడు. మధుమేహం కలిగిన పిల్లలకు ఇన్సులిన్, మెడికేషన్‌ అందించేందుకు సహకారం అందిస్తుంటుందీ ఫౌండేషన్. 👉 మరిన్ని వివరాలు
Recommended for you

politicsస్పోర్ట్స్ కోటాలో ఖాళీలు




