
నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీఆర్‌టీసీ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సూపర్‌వైజర్‌-1, జూనియర్‌ మెయింటెనర్‌ పోస్టులు భర్తీచేయనుంది. వీటికి ఐటీఐ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ డిగ్రీతోపాటు ఉద్యోగానుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. ఆ పరేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆర్‌ఏసీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టు: సూపర్‌వైజర్‌-1 ఖాళీలు: 43 అర్హత: ఎలక్ట్రానిక్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ సివిల్‌ బ్రాంచ్‌లో మూడేళ్ల డిప్లొమా. లేదా ఆ విభాగాల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వేతన శ్రేణి: నెలకు రూ.37,000-1,15,000. పోస్టు: జూనియర్‌ మెయింటెనర్‌ ఖాళీలు: 24 అర్హత: ఎలక్ట్రీషియన్‌/ ఫిట్టర్‌/ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ ట్రేడ్‌తో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ). వేతన శ్రేణి: నెలకు రూ.18,250-59,200. మూలవేతనానికి అదనంగా వీడీఏ, హెచ్‌ఆర్‌ఏ, పెర్క్స్, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), వైద్య పరీక్షలతో ఎంపిక చేస్తారు. సీబీటీకి 100 మార్కులు. ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. వ్యవధి 90 నిమిషాలు. ఇందులో అన్‌రిజర్వుడ్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ ఈడబ్ల్యూఎస్‌లు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. వారిని షార్ట్‌లిస్ట్‌ చేసి వైద్య పరీక్షల అనంతరం కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో సేవలు అందించాల్సి ఉంటుంది. పరీక్ష పూర్తి సిలబస్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వయసు: 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల వరకు సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వుడ్, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 500 . ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.10.2026. వెబ్‌సైట్‌: http://www.ncrtc.in/ .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.