
వాషింగ్టన్, సెప్టెంబర్ 13: తమపై జరిగిన 9/11 ఉగ్ర దాడులకు 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) పలు రహస్యాలను వెల్లడించింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, మరికొన్ని ప్రాంతాలపై భారీ దాడులు జరిపింది. చరిత్రలో అగ్రరాజ్యంపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి విధ్వంసం అటు యూఎస్‌నే కాక, ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ 9/11 దాడులకు పూర్వమే ఒసాబా బిన్ లాడెన్ భారత్ సహా పలు దేశాలపై దాడులకు ప్రణాళికలు వేసినట్టు లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్లను, 100 పేజీలకు పైగా రహస్య సమాచారాన్ని సీఐఏ బహిర్గతం చేసింది.




