
యూపీఐ ఎమ్‌డీఆర్‌ ఉపకరిస్తుంది సీఈఓ సమీర్‌ నిగమ్‌ యూపీఐ లావాదేవీలపై ఎమ్‌డీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌) అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, ఈ చెల్లింపులకు ఉపయోగపడుతున్న ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే, తమ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. రూ.2,000కు పైబడ్డ యూపీఐ చెల్లింపులపై వ్యాపారులు చెల్లించాల్సిన 0.4% ఎండీఆర్‌ ద్వారా వసూలయ్యే మొత్తంలో.. చెల్లింపుల యాప్‌లకు 20% వాటా అందనుంది. ఇది తమకు అదనపు ఆదాయ వనరు కనుక.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్‌ నిగమ్‌ తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితులు, మదుపర్ల సెంటిమెంటు దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మొదట్లో ఐపీఓ ప్రక్రియను ఫోన్‌పే వాయిదా వేసింది. కంపెనీ విలువను 13-15 బి. డాలర్లుగా లెక్కగట్టి, ఐపీఓలో 1.3 బి. డాలర్లు (సుమారు రూ.12,350 కోట్లు) సమీకరించాలని కంపెనీ చూస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ పోటీదారు అయిన పేటీఎమ్‌ 2021లోనే రూ.18,000 కోట్ల ఐపీఓను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్‌పేకు ఎలా లాభం అంటే..: డిజిటల్‌ లావాదేవీలను ప్రాసెసింగ్‌ చేసినందుకు గాను బ్యాంకులకు వ్యాపారులు చెల్లించే కమీషనే ఎమ్‌డీఆర్‌. ఎమ్‌డీఆర్‌ వసూళ్లలో 20% యూపీఐ సేవలందించే యాప్‌లు పొందుతాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే సంస్థ వాటా 45% వరకు ఉందని అంచనా. అంటే మొత్తం ఎమ్‌డీఆర్‌ వసూళ్లలో 10% వరకు ఈ సంస్థకు రావొచ్చు. వ్యవస్థ మొత్తం మీద ఎమ్‌డీఆర్‌ వసూళ్లు రూ.13000-26,000 కోట్ల వరకు ఉండొచ్చన్నది ఒక అంచనా. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





