
ఇంటర్నెట్ డెస్క్‌: నగదు రహిత చెల్లింపుల్లో కీలకమైన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తూ కేంద్రం చేసిన ప్రకటన వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తోంది. రూ.2000లకు మించిన లావాదేవీలపై రుసుములు తప్పవని, అయితే అవి వ్యాపార సంస్థలకే వర్తిస్తాయని కేంద్రం చెబుతోంది. కానీ, ఎటు తిరిగి వినియోగదారులపై ఆ భారం పడుతుందనేది సామాన్యుల వాదన. ఇంతకీ ఈ ఛార్జీలు (UPI Charges) ఎలా పడుతాయి..? ఎవరు కట్టాలి..? ఉదాహరణలతో తెలుసుకుందాం..! ఈ ఎండీఆర్‌ ఛార్జీలను వ్యాపారులు తమ కస్టమర్లపై బదిలీ చేయకుండా చూసుకోవాలని బ్యాంకులకు కేంద్రం సూచించింది. యూపీఐ అప్లికేషన్ ప్రొవైడర్లు వినియోగదారులపై ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా అంతర్గత ఛార్జీలను విధించడంపై నిషేధం ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, అమల్లో ఇది ఎంతవరకు సాధ్యమనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇప్పటికే కొన్ని మర్చెంట్‌ అవుట్‌లెట్ల వద్ద క్రెడిట్‌ కార్డులకు సంబంధించి బోర్డులు కన్పిస్తాయన్న సంగతి తెలిసిందే. కొన్ని వ్యాపార సంస్థలు.. క్రెడిట్‌ కార్డులతో చెల్లింపులు చేసే కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎండీఆర్‌ ఛార్జీలు అమల్లోకి వస్తే.. ఆ భారం వినియోగదారులపై వేస్తారనే ఆందోళనలు ఉన్నాయి. అంతేగాక, ఈ ఛార్జీల వల్ల వ్యాపారులు మళ్లీ నగదు రూపంలో చెల్లింపులకే మొగ్గు చూపుతారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





