
Petrol, Diesel: పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విధించే సుంకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరించింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు విమాన ఇంధనం (ATF)పై ఎగుమతి లెవీలను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 16న నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజా మార్పులు వెంటనే అమల్లోకి వచ్చాయి.




