
న్యూస్‌టుడే- మేడిపల్లి: ఉమ్మడి జిల్లాలోని వేలాది కుటుంబాలవారు గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, కువైట్, ఒమన్, బహ్రెయిన్‌ దేశాల్లో పని చేస్తూ పంపుతున్న డబ్బుతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. కాగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి అవసరాన్ని ఆసరా చేసుకుని నకిలీ ఉద్యోగాలు, తప్పుడు వీసాలు, అధిక మొత్తంలో వసూళ్లతో అనధికార ఏజెంట్లు పలువురిని మోసం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 2.50 లక్షల మంది వరకు గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా పలువురిని నకిలీ ఏజెంట్లు మోసం చేసిన ఘటనలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు : ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం ఉందంటూ మహిళలతో ప్రచారం చేస్తున్నారు. జీతం ఎంత? : కొందరికి మాత్రమే రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వస్తోంది. మిగిలిన వారు తక్కువ వేతనంతో పని చేయాలి. లేదంటే తిరిగి రావాలి. ఖర్చు : వాస్తవానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఏజెంట్లు తీసుకోవాలి. కానీ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. నకిలీలలు : లైసెన్స్‌ లేని ఏజెంట్లు గల్ఫ్‌ పంపుతామని సొమ్ము తీసుకుని పరారవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 35 మంది లైసెన్స్‌డ్‌ ఏజెంట్లు ఉండగా.. వందల సంఖ్యలో నకిలీలు ఏజెంట్లమని ప్రచారం చేసుకుంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





