
ఖరగ్‌పూర్: తూర్పు మిడ్నాపూర్ జిల్లా తమ్లూక్ జీఆర్పీ పోలీసులు హసిబుల్ ఆలీ ఖాన్ అనే రైలు టికెట్ల దళారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో రూ.22,270 విలువైన పాత టికెట్లు, రూ.6,128.50 విలువైన మూడు కొత్త టికెట్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. మాతృభాషలో ప్రాథమిక విద్యకు రాతెస స్వాగతం ఖరగ్‌పూర్: ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్న అభిప్రాయాలను రాతెస్ సంస్థ స్వాగతించింది. మాతృభాషలో చదివిన పిల్లలు ఇతర భాషలను సులభంగా నేర్చుకోగలరని సంస్థ అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు పేర్కొన్నారు. మాతృభాషను అందరూ ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. హిజిలి జైలు అమరవీరులకు నివాళి ఖరగ్‌పూర్: దేశ స్వాతంత్య్ర పోరాటంలో 1931 సెప్టెంబర్ 16న బ్రిటిష్ పోలీసులు కాల్చి చంపిన విప్లవకారులు తారకేశ్వర్ సేన్‌గుప్తా, సంతోష్ మిత్రాల స్మృతిలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నివాళులర్పించారు. హిజిలి జైలు (ప్రస్తుతం ఐఐటీ ప్రాంగణంలో ఉంది)లో వారి విగ్రహాల వద్ద ఐఐటీ అధికారులు, నాగరిక సమాజ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





