
దోమకొండ: అవగాహనతోనే హెచ్ఐవీ నివారణ సాధ్యమవుతుందని తెలంగాణ ఎయిడ్స్ నివారణ సంస్థ బృందం ప్రతినిధులు డాక్టర్ తిరుమల్ రావు, కె.రమేష్ తెలిపారు. దోమకొండలో బుధవారం వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం వారు గ్రామ పంచాయతీ, దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి, మహిళా గ్రామ సంఘాలను సందర్శించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, సుఖ వ్యాధుల ప్రచారం నిమిత్తం గోడలపై వేయించిన రాతలను పరిశీలించారు. గ్రామపంచాయతీ సహకారంపై పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరిలో హెచ్ఐవీపై అవగాహన పెరగాలని కోరారు. అవగాహనతోపాటు నివారణ జాగ్రత్తలతోనే హెచ్ఐవీని అరికట్టడం సాధ్యపడుతుందన్నారు. హెచ్ఐవీ నివారణలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని, లింకు వర్కర్ స్కీం ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, గ్రామ ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వైఆర్‌జీ కేర్ ఉమ్మడి జిల్లా డీఆర్పీ సుధాకర్, గ్రామ కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, అమర్నాథ్, చింతల స్వామి, రెడ్ క్రాస్ మండల అధ్యక్షుడు రవికుమార్, నాయకులు నాగారపు ఎల్లయ్య, శ్యాం కుమార్, గంగా రాములు, రాజయ్య, ఏఎన్ ఎం సువర్ణ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





