చివరిగా అప్డేట్ చేసిన సమయం:
Vemireddy Couple Clothes Distributed To Tirumala Employees: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో సేవలను అందిస్తోన్న శ్రీవారి ఆలయ సిబ్బందికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నూతన వస్త్రాలను బహుమానంగా అందజేశారు. శ్రీవారి ఆలయంలో అర్చకులు, వేదపారాయణదారులు, ఉద్యోగులు, లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీ పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి కానుకలు అందించారు.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Samayam Telugu లో చూడండి






