
కి డ్నీ వ్యాధులు తొలిదశలో ఎటువంటి తీవ్రమైన లక్షణాలు చూపించవు. అందుకే వీటిని 'సైలెంట్' అంటారు. అయితే కింది లక్షణాల్ని వయసు పైబడటం వల్లో లేదా నీరసం వల్లో అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఊబకాయం, గుండె జబ్బులు వేగంగా పెరగడమే ప్రధాన కారణం. ఆహారంలో అధిక ఉప్పు, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం రక్తపోటును పెంచి కిడ్నీల్ని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి నేరుగా కిడ్నీ వ్యాధిని కలిగించకపోయినా.. నిద్రలేమి, బీపీ పెరగడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దారితీసి పరోక్షంగా కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వెళ్లడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ఖచ్చితంగా అంటున్నారు డాక్టర్. అవసరం ఉన్నా లేకున్నా స్టెరాయిడ్స్ లేని నొప్పి నివారణ మందులు (NSAIDs) విరివిగా వాడటం వల్ల కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గి తీవ్ర గాయం (Kidney Injury) జరుగుతుంది. డయాబెటిస్, బీపీ ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. అలాగే ప్రామాణికత లేని హెర్బల్ సప్లిమెంట్లలో ప్రమాదకరమైన రసాయనాలు, భార లోహాలు (Heavy Metals) ఉండొచ్చు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్, పౌడర్లు, సప్లిమెంట్లు వాడకూడదని ICMR స్పష్టంగా హెచ్చరిస్తోంది. సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు డాక్టర్ క్రిస్టిన్ జార్జ్ కన్సల్టెంట్ - నెఫ్రాలజిస్ట్ & రీనల్ ట్రాన్స్‌ప్లాంట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్.




