
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గూగుల్ డీప్మైండ్లో పనిచేసిన ప్రముఖ పరిశోధకుడు జోష్ ఎంగెల్స్, వచ్చే ఐదేళ్లలో అధునాతన ఏఐ వ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గూగుల్ డీప్మైండ్లో పనిచేసిన ప్రముఖ పరిశోధకుడు జోష్ ఎంగెల్స్, వచ్చే ఐదేళ్లలో అధునాతన ఏఐ వల్ల భారీ నష్టం జరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈ ప్రమాదం తన దృష్టిలో అత్యంత తీవ్రమైనది కావడంతో, ఏఐ భద్రతను ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సమస్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. డీప్మైండ్లో పనిచేయడం తనకు ఎంతో ఇష్టమైనప్పటికీ, ఇటీవలే ఆ సంస్థను వీడిన ఎంగెల్స్, ప్రస్తుతం ఎంఈటీఆర్ అనే ఏఐ మూల్యాంకన సంస్థలో చేరారు. గతంలో ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి సంస్థల నుంచి వచ్చిన అవకాశాలను తిరస్కరించినట్లు వెల్లడించారు. అయితే, ఏఐ ప్రమాదాలపై ఉన్న ఆందోళన కారణంగా ఉద్యోగం మారినట్లు తెలిపారు. ఎంగెల్స్ ప్రధానంగా ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్’ అనే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంటే, ఒక ఏఐ వ్యవస్థ మరో ఏఐని రూపొందించడం లేదా తన సామర్థ్యాలను తానే మెరుగుపరుచుకోవడం. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగితే, కొత్త వ్యవస్థలు మరింత శక్తిమంతంగా మారి, మరింత మెరుగైన ఏఐని రూపొందించగలవని ఆయన వివరించారు. అయితే, ఇలాంటి వ్యవస్థలు మానవ లక్ష్యాలకు అనుగుణంగా లేకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న ఏఐ మోడళ్లలోనూ ఆందోళన కలిగించే ప్రవర్తన కనిపిస్తున్నట్లు ఎంగెల్స్ తెలిపారు. కొన్ని మోడళ్లు పరస్పరం కుమ్మక్కవడం, సంస్థల వ్యవస్థలను హ్యాక్ చేయడం, తమ చర్యలను దాచడం, మనుషులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు బయటపడ్డాయని చెప్పారు.





