
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వాకింగ్, జాగింగ్, వెయిట్ లిప్టింగ్ వంటివి చేస్తే ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయని హెల్త్‌లైన్ తెలిపింది. ఎముకల నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల ఎముకల బలంగా మారుతాయి. బీన్స్, పాలు, మాంసంలో ప్రోటీన్ ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. రోజుకి 1,000 నుంచి 1,200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోండి. పాలు, నువ్వులు, మునగాకులో కాల్షియం అధికం. విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల శరీరం కాల్షియంను సరిగా గ్రహించుకోగలదు. ఫ్యాటీ చేపల్ని తినడం, ఎండలో ఉండటంతో విటమిన్ డి అందుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల వాపు కంట్రోల్ అవుతుంది. దీంతో ఎముకలను ఖనిజాలను కోల్పోవు. కూరగాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చుతుంది. కూరగాయలు తింటే ఎముకలన మినరల్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. అధిక బరువు పలు సమస్యలకు కారణం అవుతుంది. బరువు ఎక్కువగా ఉండటం లేదా అతి తక్కువగా ఉండటం వల్ల అస్థిపంజరంపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి సరైన బరువును కలిగి ఉండండి. మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినండి. ఇవి ఎముకలను బలంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల కాల్షియం శోషణ దెబ్బతింటుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి.




