
ఇంటర్నెట్ డెస్క్‌: సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం.. భారత క్రీడా రంగం (Team India Sports) మరిచిపోలేని రోజు. ఇటు హాకీ.. అటు క్రికెట్‌లో మన జట్లు అద్భుత విజయాలు సాధించాయి. తొలుత జూనియర్ ఆసియా కప్‌లో పురుషుల, మహిళల జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఇక మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్‌ను దేశానికి ఎనిమిదోసారి అందించింది. పురుషుల క్రికెట్‌లో అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ హాకీ, క్రికెట్‌ జట్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘భారత క్రికెట్ ( Team India ) గర్వపడే క్షణాలు. మహిళా జట్టుకు కంగ్రాట్స్‌. ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం అద్భుతం. టోర్నీ ఆసాంతం ఆత్మవిశ్వాసం, నిలకడ, స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించారు. ఈ విజయం భవిష్యత్తులో లక్షలాది మంది యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపనుంది. వారు దేశం కోసం ఆడేందుకు ముందుకు వస్తారనడంలో సందేహం లేదు’’ అని ప్రధాని మోదీ ( PM Modi ) పోస్టు పెట్టారు. ‘‘జూనియర్ ఆసియా కప్‌ ( Asia Cup ) మహిళలు, పురుషుల విభాగంలో విజేతలుగా నిలవడం అభినందనీయం. ఫైనల్‌లో దక్షిణ కొరియాను పురుషుల జట్టు ఓడించింది. ఇక మహిళల విభాగంలో చైనాను మట్టికరిపించి భారత్‌ ఛాంపియన్‌గా అవతరించింది’’ అని మోదీ ప్రశంసించారు. మహిళల ఆసియా కప్‌ను గెలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ( Pawan Kalyan ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘‘అద్భుతమైన నైపుణ్యం, నిబద్ధత, పోరాటం పటిమ చూపించిన భారత మహిళా జట్టుకు అభినందనలు. భారత క్రికెట్‌తోపాటు మహిళా లోకం గర్వించేలా విజయం సాధించారు. కంగ్రాట్స్. మిమ్మల్ని చూసి భారత్‌ గర్వపడుతోంది’’ అని పవన్ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.





