
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలో విశేషాదరణ పొందిన ‘మీర్జాపూర్’ (Mirzapur) సిరీస్.. ఇప్పుడు వెండితెరపైనా అదే జోరును కొనసాగిస్తోంది. అలీ ఫజల్, దివ్యేందు, పంకజ్ త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మీర్జాపూర్: ది మూవీ’ (Mirzapur The Movie) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దేశీయంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం.. దేశీయంగా ఈ సినిమా రూ.220.10 కోట్ల గ్రాస్ సాధించింది. నెట్ వసూళ్లు రూ.184.79 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 4న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి తన సత్తా చాటుకుంది. 2018లో స్ట్రీమింగ్ సిరీస్‌గా మొదలైన ‘మీర్జాపూర్’.. మూడు సీజన్లతో భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన ఓటీటీ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు తొలిసారిగా థియేటర్లలోకి వచ్చి అదే స్థాయి విజయాన్ని అందుకుంటోంది (Mirzapur The Movie Collections). 2018 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో.. తొలి సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు చెప్పని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. రసిక దుగల్, శ్రియ పిల్‌గావ్కర్, శ్వేతా త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ తమ పాత పాత్రల్లోనే అలరించగా.. జితేంద్ర కుమార్, రవి కిషన్, సోనాల్ చౌహాన్ కొత్తగా సందడి చేశారు. ఈ దర్శకుడు గుర్మీత్‌ సింగ్‌ తెరకెక్కించగా, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana).



