అధ్యయనంలో 315 మందిని 16 వారాల పాటు పరిశీలించిన పరిశోధకులు వారిని వారానికి 75 నిమిషాల పాటు స్పీడ్‌గా నడవమని సూచించారు . అధ్యయనంలో పాల్గొన్నవారిని 2 గ్రూపులుగా విభజించి ఓ గ్రూపు వారు 75 నిమిషాల స్పీడ్ వాక్ని పూర్తిచేశారు. రెండో గ్రూపు వారు అదే వర్కౌట్‌ని వారంలో మూడువిడతలుగా చేశారు. తర్వాత రెండు గ్రూపుల కొలతల్ని పరిశీలించారు. ఆశ్చర్యకరంగా 75 నిమిషాల పాటు ఒకే సెషన్లో చేసినవారూ, మూడు సెషన్లలో వర్కౌట్ చేసిన వ్యక్తుల ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయని తేలింది. అధ్యయనం ప్రకారం, 75 నిమిషాల స్పీడ్ వాకింగ్ చేసిన వారి బాడీ ఫ్యాట్ తగ్గింది. అంతేకాకుండా, పాల్గొన్నవారి బరువు, ఎత్తుకు అనుగుణంగా, నడుము చుట్టుకొలత కూడా తగ్గింది. 75 నిమిషాల పాటు వేగంగా నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగ్గా మారడమే కాకుండా శరీరానికి మేలు చేస్తుంది. పైగా నడక అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఇది మీ వీలుని బట్టి ఎవరైనా కూడా ఎప్పుడైనా నడవొచ్చు. బెల్లీ ఫ్యాట్ బాడీ ఫ్యాట్ కంటే ప్రమాదమే. ఎందుకంటే ఇది అవయవాల పనితీరుని ఎఫెక్ట్ చేస్తుంది. కంటికి కనిపించే బెల్లీ ఫ్యాట్, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి నెగెటీవ్ ఎఫెక్ట్‌ని చూపుతుంది. ఇది ఆకలి, బరువు తగ్గించే చర్యలను ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు , ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుందని, మెటబాలిక్ సిండ్రోమ్కి కూడా దారితీస్తుందని చెబుతోంది. బ్రిస్క్ ఇంటర్వెల్ వాకింగ్ అంటే స్పీడ్‌గా నడిచి, నెమ్మదిగా రెస్ట్ తీసుకోవడం. ఉదాహారణకి 3 నిమిషాల స్పీడ్ వాకింగ్ 3 నిమిషాల కాస్తా నెమ్మదిగా నడవడం.. ఇలానే మళ్లీ మళ్లీ నడవడం. బ్రేక్ తీసుకుంటూ స్పీడ్‌గా నవడం అనేది సాధారణ నడక కంటే చాలా మంచిది. ఎందుకంటే, ఇది తక్కువ టైమ్‌ని తీసుకుంటుంది. 75 నిమిషాల బ్రిస్క్ ఇంటర్వెల్ వాకింగ్ నడుము చుట్టూ కొవ్వుపేరుకుపోయి ఉన్నవారికి చక్కగా పనిచేస్తుంది. డెస్క్ జాబ్ చేసేవారు బిజీ షెడ్యూల్ కారణంగా వర్కౌట్ చేయలేనివారు కూడా దీనిని ఈజీగా చేయొచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఈ వర్కౌట్ చేస్తే చాలా మంచిది. అప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకునేవారు వారానికి ఒకసారి వీలైనప్పుడు 75 నిమిషాల పాటు స్పీడ్‌గా నడవొచ్చు. లేదా వారానికి మూడుసార్లు ఒక్కోసారి 25 నిమిషాల చొప్పున నడవొచ్చు. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.