
శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వరదకు గంగాయి పల్లి గ్రామం ఊడుగుల చెరువు కట్టుకాలువకు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చింది. స్పందించిన గ్రామ యువకుడు తాటి పవన్ కుమార్ గుప్తా సొంత డబ్బులతో జేసీబీ వినియోగించి కట్టు కాలువకు మరమ్మత్తు చేయించారు. వర్షం నీరు వృథాగా పోకుండా కృషి చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





