
Gold Price : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold price) సోమవారం ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా (USA) లో ద్రవ్యోల్బణం (Inflation) అంచనాలకు మించి నమోదు కావడంతో ఈ వారం ఫెడరల్ రిజర్వ్ (Fed reserv) వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు బలపడ్డాయి. దీనికి తోడు ఎర్ర సముద్రం (Red Sea) ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరల (Crude Oil price) ను మండించడంతో పసిడి (Gold) పై మరింత ప్రతికూల ప్రభావం పడింది. శుక్రవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. అమెరికాలో ఆగస్టు నెలకుగాను కీలక ద్రవ్యోల్బణం (ఆహారం, ఇంధన ధరలు మినహాయించి) 0.3 శాతం పెరిగింది. ఇది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడానికి దారితీస్తుందనే భయాలను మార్కెట్లో నింపింది. ట్రేడర్లు ఈ నెలలో వడ్డీ రేట్ల పెంపునకు 88 శాతం అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి కానుంది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వంటి రాబడి లేని ఆస్తులపై మదుపరులు ఆసక్తి చూపరు. ఈ అంచనాలతో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు దాదాపు 4,340 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ 0.2 శాతం నష్టపోయింది. వెండి ధర కూడా 0.8 శాతం తగ్గి ఔన్స్‌కు 64 డాలర్లకు చేరింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముడి చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. భారత మార్కెట్లో వినాయక చవితి సందర్భంగా ఇవాళ ఉదయం సెషన్లో ఎంసీఎక్స్ ట్రేడింగ్ జరగలేదు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు మాత్రమే ట్రేడింగ్ కొనసాగుతుంది.





