
హాలహర్వి: కర్నూలు జిల్లా హాలహర్వి మండల కేంద్రంలో వినాయక చవితి పండుగ సందర్భంగా చెక్క భజన కార్యక్రమం ఆకట్టుకుంది. స్థానిక మండలిగేరిలో పాత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిన్నారులు చెక్క భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం పండుగ అంటే డీజేలు హోరు, సినిమా పాటలతో నిర్వహిస్తున్న పండుగ పాత కళాలను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో గాను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం తిలకించేందుకు స్థానికులతో పాటు చూట్టూ పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తక్కువ కాలంలో చిన్నారులకు శిక్షణ ఇచ్చిన గురువు నాగరాజును గ్రామస్థులు అభినందించారు.. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు స్థానిక కాలనీ వాసులు తమ వంతు సహకారం అందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




