
కుటుంబ అవసరాలకు సరిపోయే ప్రీమియం ఎమ్పీవీ కోసం చూస్తున్నవారికి కియా నుంచి కొత్త ఎంపికలు వచ్చాయి. Carens Clavis ఆటోమేటిక్ వేరియంట్ శ్రేణిని కంపెనీ పెంచింది. ఇప్పటివరకు ఎక్కువ ధర ఉన్న వేరియంట్లలో లభించిన ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికను తక్కువ స్థాయి వేరియంట్లలోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కొనుగోలుదారులకు మరిన్ని అవకాశాలు లభించాయి.





