
ఖమ్మం కార్పొరేషన్‌: సర్‌ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం మ్యాపింగ్ కాని, అనామిలిస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్‌.దివాకర అధికారులను ఆదేశించారు. సర్ ప్రక్రియలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లు లేవనెత్తిన అభ్యంతరాలను ఆయన నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీల్లో హాజరై బీఎల్‌వోలకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా తప్పులు లేని, పారదర్శకమైన సమగ్ర ఓటరు జాబితాను రూపొందించాలని సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





