
పలు పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్‌టీఏ ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం (2027-28) ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) బుధవారం రాత్రి జేఈఈ మెయిన్‌తోపాటు మరికొన్ని పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మెయిన్‌ తొలి విడత పరీక్షలు జనవరి 22-24, 28-30వ తేదీ వరకు.. అంటే ఆరు రోజులపాటు నిర్వహిస్తారు. పరీక్ష నోటిఫికేషన్‌ వచ్చే నెలలో వెలువడనుంది. ఇక జేఈఈ మెయిన్‌ చివరి విడతను ప్రకటించకున్నా అది ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. ఈ రెండిటిలో అధిక స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కుల ఆధారంగా 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. అందులో ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




