
జీవితంలో ఎదురైన వైఫల్యాలే చివరి గమ్యం కావని ఓ యువకుడు నిరూపించాడు. ఇంజినీరింగ్‌లో కేవలం 6.4 CGPA.. కాలేజీలో పలు బ్యాక్‌లాగ్స్.. JEEలో రెండుసార్లు విఫలం.. Upsc, RPSC పరీక్షల్లోనూ విజయం దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగిన శుభమ్ సోనీ ప్రస్తుతం ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ Courseraలో Frontend Engineerగా పనిచేస్తున్నట్లు ఓ సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంది. ఆయన వార్షిక వేతనం రూ.60 లక్షలకు పైగా ఉంటుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.





