
కూసుమంచి: కూసుమంచిలోని శివాలయం వీధిలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా.. అతని కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పోచారానికి చెందిన సట్టు శ్రీను (48) తన కుమార్తెతో కలిసి కూసుమంచి వెళ్లి తిరిగి పోచారం వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాక్టర్.. ద్వి చక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శ్రీను తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన అతని కుమార్తెను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





