
హొససేటె: వినాయక చవితి సందర్భంగా ట్రాక్టర్‌లో వినాయకుడి ప్రతిమను తరలిస్తున్న సమయంలో విద్యుత్తు తీగ తగిలి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ శివారు నాగేనహళ్లి వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. కమలాపురకు చెందిన యువకుల బృందం హొసపేటె నుంచి స్వస్థలానికి వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా హైటెన్షన్‌ విద్యుత్తు తీగ తగిలి విద్యుదాఘాతం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న హులుగప్ప, దీపక్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వినాయకుడి ప్రతిమ కిందపడి కాలిపోయింది. క్షతగాత్రులకు స్థానికంగా చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ జాహ్నవి, డీఎస్పీ మురళీధర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై గ్రామీణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



