
ధర్మపురి: ధర్మపురి పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అర్చకులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ పూజలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సంగనభట్ల దినేశ్‌, రవీందర్ పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





